గ్యాంగ్ స్టర్ భూమిని పేదలకు పంచిన ముఖ్యమంత్రి (వీడియో)
కాల్చి చంపబడిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్య నాథ్ పేదలకు పంచారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాల్చి చంపబడిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్య నాథ్ పేదలకు పంచారు. శుక్రవారం యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో సీఎం యోగీ ఆధిత్యనాధ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇంటి తాళాలు అందజేశారు. ఈ నెల ప్రారంభంలో లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ప్లాట్లను పరిశీలించి లబ్ధిదారులు, అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు. అతిక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్‌లకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ నగరంలో 226 అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు.