Rajiv Kumar: సీఈసీ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ( chief election commissioner) రాజీవ్‌ కుమార్‌ (Rajiv Kumar)కు పెను ప్రమాదం తప్పింది. ఆయన

Update: 2024-10-16 11:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ( chief election commissioner) రాజీవ్‌ కుమార్‌ (Rajiv Kumar)కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌, ఉత్తరాఖండ్‌ అదనపు సీఈవో విజయ్‌ కుమార్‌తో కలిసి మున్సియారీకి హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే, హెలికాప్టర్‌ పర్వత ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్‌ హెలికాప్టర్‌ను పిథోరాగఢ్‌ (Pithoragarh) జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. హెలికాప్టర్ లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణ అనకూలించిన తర్వాత ప్రయాణాన్ని సాగిస్తారని వెల్లడించింది.

ఉపఎన్నిక

ఇకపోతే, ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్ సీటుకు ఉపఎన్నిక జరగనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాలకు, వయనాడ్ లోక్ సభ స్థానానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. కేదార్‌నాథ్ అసెంబ్లీ స్థానానికి, నాందేడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న ఉంటుంది.


Similar News