ఆ మావోయిస్టులను విడిచి పెట్టేదే లేదు: సీఎం బఘేల్ స్ట్రాంగ్ వార్నింగ్

ఛత్తీస్ గఢ్‌లోని దంతెవాడలో జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.

Update: 2023-04-26 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్‌లోని దంతెవాడలో జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ స్పందించారు. మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. మావోయిస్టుల దాడిలో 11 మంది జవాన్లు మృతి చెందడం విచారకరమన్నారు.

ఈ దాడికి పాల్పడిన మావోయిస్టులను ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నక్సలైట్లతో పోరు తుది దశకు చేరుకుందని, వారిని విడిచి పెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. ఇక, మావోల దాడిలో 11 మంది జవాన్లు మృతి చెందడపంతో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం భూపేశ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News