'వందేభారత్' వేళల్లో మార్పులు

'వందేభారత్' రైలు వేళను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలపారు. రైలుపై గుర్తు తెలియని దుండగుల రాళ్ల దాడి చేయడంతో రీషెడ్యూల్ చేశమని వారు తెలిపారు.

Update: 2023-04-06 02:39 GMT

దిశ, వెబ్ డెస్క్: 'వందేభారత్' రైలు వేళను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలపారు. రైలుపై గుర్తు తెలియని దుండగుల రాళ్ల దాడి చేయడంతో రీషెడ్యూల్ చేశమని వారు తెలిపారు. ఈ రోజు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నాలుగు గంటల ఆలస్యంగా అంటే.. ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఉదయం 9.45 గంటలకు బయలుదేరనుందని అధికారులు తెలిపారు. 'వందేభారత్'పై తరచూ దాడులు చేస్తుండటంతో విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే శాఖ సీరియస్ గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగానే కొందరు కావాలని రైలుపై రాళ్ల దాడి చేస్తున్నారని, దీని వెనుక జరగుతున్న కుట్రను త్వరలో బయట పెడతామని రైల్వే పోలీసులు చెబుతున్నారు. 

Tags:    

Similar News