Chandrayaan 3: ఉష్ణోగ్రతలపై క్లారిటీ.. చంద్రుడిపై టెంపరేచర్స్ గురించి కొత్త అప్ డేట్..

చంద్రుడిపై మన చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ దిగినప్పటి నుంచి రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది.

Update: 2023-08-27 11:32 GMT

న్యూఢిల్లీ : చంద్రుడిపై మన చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ దిగినప్పటి నుంచి రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది. తాజాగా అందించిన సమాచారంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడయ్యాయి. విక్రమ్ ల్యాండర్‌‌లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్ (ఛేస్ట్) పేలోడ్.. చంద్రుడి ఉపరిత ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌‌ను మన ఇస్రో శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈమేరకు వివరాలతో ఇస్రో ఒక ట్వీట్ చేసింది. ‘ ఛేస్ట్’ పేలోడ్ అనేది కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుందని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ దీనికి ఉంటుందని పేర్కొంది.

ఛేస్ట్‌లో దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు ఉంటాయని, అవే చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల వివరాలను ఇస్రోకు చేరవేస్తాయని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని షేర్ చేసింది. లూనార్ సౌత్‌ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి అని చెప్పింది. పూర్తి వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని పేర్కొంది. ఛేస్ట్ పేలోడ్‌ను తిరువనంతపురంలోని స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, అహ్మదాబాద్‌లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో తయారు చేసినట్లు తెలిపింది. చంద్రయాన్-3లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్‌పైన 4, ప్రజ్ఞాన్ రోవర్‌పైన రెండు ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటిని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు.

Tags:    

Similar News