చంద్రయాన్-3 సక్సెస్.. సిగ్గు పడుతున్న అంటూ సొంత దేశంపై విమర్శలు గుప్పించిన నటి

చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.

Update: 2023-08-23 15:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్‌గా సేఫ్ ల్యాండ్ కావడంతో.. భారత దేశానికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ కూడా స్పందించింది. ఈ మేరకు ‘‘భారత్‌తో శత్రుత్వాన్ని పక్కనపెడితే ఇస్రోను అభినందిచాల్సిందే. భారత్ ను అందుకోవడానికి పాక్‌కు 2,3 దశాబ్దాలు పడుతుంది. భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. దురదృష్ణవశాత్తు ఈ దుస్థితికి మనమే కారణం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News