Champai Soren : చంపై సోరెన్‌పై జార్ఖండ్ సీఎం స్పైయింగ్ : హిమంత బిస్వశర్మ

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరిన వేళ అసోం సీఎం హిమంత బిస్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-30 15:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరిన వేళ అసోం సీఎం హిమంత బిస్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. చంపై సోరెన్‌ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నిఘా పెట్టించారని ఆయన ఆరోపించారు.

దేశంలోని ఏ రాష్ట్ర సీఎం కూడా సొంత ప్రభుత్వంలోని మంత్రిపై ఈవిధంగా నిఘా పెట్టించి ఉండరని వ్యాఖ్యానించారు. ‘‘చంపై సోరెన్‌పై నిఘా పెట్టిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నాలుక కరుచుకున్న హేమంత్ సోరెన్, ఆ ఇద్దరు వ్యక్తులను చంపై సోరెన్‌కు భద్రత కల్పించేందుకు పంపామన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు ?’’ అని హిమంత బిస్వశర్మ ప్రశ్నించారు. 


Similar News