ఝార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంప సోరెన్

ఝార్ఖండ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. దీంతో ఝార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

Update: 2024-02-02 08:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఝార్ఖండ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. దీంతో ఝార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి పరిణామాల మధ్య ఝార్ఖండ్ సీఎంగా జీఎంఎం సీనియర్ నేత చంప సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. మరో పది రోజుల్లోజరగనున్న ఫ్లోర్ టెస్టులో ఆయన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

చంప సోరెన్ కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా,కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ కూటమికి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఆరుసార్లు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు చంప సోరెన్. రవాణా శాఖ మంత్రిగా కూడా సోరెన్ పనిచేశారు. హేమంత్ భార్య కల్పనా సోరెన్ ను సీఎంగా బాధ్యతలు చేపడతారని భావించారు. కానీ.. చివరకు అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సొరేన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఝార్ఖండ్ టైగర్..

చంప సోరెన్‌ సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.బిహార్ నుంచి ప్రత్యేక ఝార్ఖండ్ కోసం ఆందోళన చేసినవారిలో చంప ముఖ్యుడిగా ఉన్నాడు. శిబు సోరెన్‌తో పాటు చంప సైతం ప్రత్యేక జార్ఖండ్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్నుంచి చంపను ఝార్ఖండ్ టైగర్ పిలుచుంకుంటున్నారు అక్కడి ప్రజలు.

ఆరుసార్లు అసెంబ్లీకి..

తొలిసారిగా 2005లో ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 2010 నుంచి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్ హౌసింగ్‌ మంత్రిగా పనిచేశారు. జూలై 2013 నుంచి డిసెంబర్ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి, 2019లో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News