జార్ఖండ్‌ సంక్షోభానికి తెర.. విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్ సర్కార్

జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో చంపయీ సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపయీ సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి.

Update: 2024-02-05 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో చంపయీ సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపయీ సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి. కాగా, మనీ ల్యాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇవాళ గవర్నర్ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెజార్టీ సభ్యులు చంపయీ సోరెన్‌కు జై కొట్టారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. దీంతో సోరెన్‌కు 47 మంది సభ్యుల సపోర్ట్ ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటు సునాయాసమైంది.

Tags:    

Similar News