రాజ్య సభలో తీవ్ర గందరగోళం.. విపక్షాల తీరుతో సభ నుంచి వెళ్లిపోయిన చైర్మన్‌

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Update: 2024-08-08 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బుధవారం రోజు ఒలింపిక్స్ నుంచి 100 గ్రాముల అధిక బరువు కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలీపై అయింది. ఫైనల్ మ్యాచ్ ముందు ఇలా జరగడంతో భారత అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే గురువారం రాజ్యసభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే ఫోగట్‌ వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. ఈ సందర్భం చైర్మన్ ఇది సందర్భం కాదని భారత క్రీడా అధికారులు చర్చలు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. అయినా వినకుండా రాజ్యసభల్లో చర్చించాల్సిందేనని విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అసహనం వ్యక్తం చేశారు. సభలో సమస్యలపై చర్చించే సమయంలో సభను ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించే విదంగా ఉన్న విపక్షాల తీరుపై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా ఈ రోజు లోక్ సభ, రాజ్యసభలో వక్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రవేశ పెట్టనుంది.


Similar News