బిహారీ కూలీలపై దాడిలో కేంద్రం జోక్యం చేసుకోవాలి..

తమిళనాడు లో బీహార్ కూలీల పై దాడి వివాదస్పదంగా మారింది.

Update: 2023-03-05 12:58 GMT

పాట్నా: తమిళనాడు లో బీహార్ కూలీల పై దాడి వివాదస్పదంగా మారింది. ఈ విషయం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి తెరలేపింది. దీంతో ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తాజాగా మీడియా సమావేశంలో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కోరారు. ‘ఈ అంశాన్ని బీహార్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇప్పటికే దీనిపై విచారణకుగానూ ఓ బృందాన్ని తమిళనాడు పంపించాం. వలస కూలీలపై దాడులను తమిళనాడు, బీహార్ ప్రభుత్వం ఉపేక్షించవు’ అని చెప్పారు. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొందరు వాదిస్తున్నారని అన్నారు. ఇది నిజం కాదని దీనిపై ఇప్పటికే ప్రభుత్వ బృందాన్ని తమిళనాడుకు పంపించామని తెలిపారు.

ప్రభుత్వ ఆందోళనను వారు చూడకుండానే ఇష్టం వచ్చినట్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఈ అంశంలో వలస కూలీల భద్రతకు పూర్తి హామీ ఇచ్చారు. అంతకుముందు కొందరు బీహార్‌కు చెందిన హిందీ మాట్లాడే కార్మికులు తమిళనాడులో ద్వేషపూరిత నేరాలకు గురవుతున్నారని సోషల్ మీడియాలో ధృవీకరించని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో వారిపై దాడి జరిగినట్లు వీడియోలు వైరల్‌గా మారాయి. ఇది కాస్తా రాజకీయ చర్చకు దారి తీసింది. మరోవైపు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు తనను నిలదీశారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై ట్వీట్ చేశారు. దమ్ముంటే 24 గంటల్లో తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Also Read...

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కొత్త మంత్రి..

Tags:    

Similar News