iPhones : ఆ యాపిల్ ప్రోడక్ట్స్ వాడారో.. తస్మాత్ జాగ్రత్త : భారత ప్రభుత్వం

దిశ, నేషనల్ బ్యూరో : యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు.

Update: 2024-09-22 13:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి ఐఫోన్లపై కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ జారీ చేసింది. యాపిల్ కంపెనీకి చెందిన పలు ప్రోడక్ట్స్‌లో ముప్పును గుర్తించామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) వెల్లడించింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లో 18, 17.7 కంటే మునుపటి వర్షన్లతో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఐప్యాడ్ ఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో 18, 17.7 కంటే మునుపటి వర్షన్లతో యూజర్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సెర్ట్ పేర్కొంది.

మ్యాక్ ఓఎస్ సొనోమా ప్లాట్‌ఫామ్‌లో 14.7 కంటే మునుపటి వర్షన్లు, మ్యాక్ ఓఎస్ వెంచురా ప్లాట్‌ఫామ్‌లో 13.7 కంటే మునుపటి వర్షన్లు, మ్యాక్ ఓఎస్ సికోయా ప్లాట్‌ఫామ్‌లో 15 కంటే మునుపటి వర్షన్లతో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సెర్ట్ వెల్లడించింది. సఫారీ ప్లాట్‌ఫామ్‌లో 18 కంటే మునుపటి వర్షన్లకు దూరంగా ఉండటం మంచిదని సూచించింది. ఈ మేరకు వివరాలతో కూడిన అడ్వైజరీని సెర్ట్ ఈనెల 19న అధికారికంగా విడుదల చేసింది. ఆయా ప్రోడక్ట్స్ వల్ల యూజర్లపై సైబర్ దాడులు జరగొచ్చని తెలిపింది. ఫోన్లలోకి సైబర్ కేటుగాళ్లు చొరబడి సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే రిస్క్ ఉంటుందని సెర్ట్ హెచ్చరించింది.


Similar News