మిమ్ముల్ని కోటీశ్వరులను చేసే అద్భుతమైన పథకం ఇదే!

కోటీశ్వరులు అవ్వాలని ఎవరికి ఉండదు చాలా మంది కోటీశ్వరులు అవ్వడానికి మార్గాలు వెతుకుతుంటారు. అయితే అలాంటి వారికే ఈ సూపర్ స్కీం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుంది.

Update: 2023-08-10 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కోటీశ్వరులు అవ్వాలని ఎవరికి ఉండదు చాలా మంది కోటీశ్వరులు అవ్వడానికి మార్గాలు వెతుకుతుంటారు. అయితే అలాంటి వారికే ఈ సూపర్ స్కీం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుంది. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో చేరితే ఈజీగా కోటీ శ్వరులు అయిపోవచ్చు. ఈ పథకంలో చేరి ప్రతీ నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు వచ్చే రాబాడి మారుతుంది. కాగా మీరు కోటికి పైగా డబ్బు పొందాలంటే, ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. పెట్టిన డబ్బులు, వచ్చిన రాబడి, విత్‌డ్రా మొత్తంపై ఎలాంటి పన్ను బాదుడు ఉండదు. ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు ఉంది. చాలా కాలం నుంచి ఇదే వడ్డీ రేటు కొనసాగుతూ వస్తోంది. ప్రభుత్వం వడ్డీ రేటును పెంచడం లేదు. ఇతర స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ వడ్డీ రేటు ప్రకారం మీరు పీపీఎఫ్‌లో రూ.కోటి పొందాలని భావిస్తే.. నెలకు రూ. 12,500 డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా మీరు 25 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి.


Similar News