దిశ, వెబ్ డెస్క్ : సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అధిక ధరలతో అష్టకష్టాలు పడుతున్న సగటు జీవికి భారీ ఊరట కలిగేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. భారత్ బ్రాండ్(Bharath Brand) పేరుతో అతి తక్కువ ధరకే బియ్యం, గోధుమ పిండిని విక్రయించేందుకు మరోసారి సిద్ధం అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం..నాఫెడ్(NAFED), ఎన్సీసీఎఫ్(NCCF), కేంద్రీయ బండార్(KENDRIYA BANDAR) వంటి సంస్థల ద్వారా నేటి నుండి గోధుమ పిండి కిలో రూ.30కు, బియ్యం కిలో రూ.34కే విక్రయించనుంది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు తొలి దశలో భారత్ బ్రాండ్ పేరుతో బియ్యం విక్రయాలు చేపట్టింది. ఇపుడు రెండో దశలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ(FCI) నుంచి ఇప్పటికే సేకరించారు. ఈ నిల్వలు అయిపోయేంత వరకు విక్రయాలు కొనసాగించనున్నట్టు కేంద్రం తెలిపింది. అయితే మొదటి దశలో బియ్యం, గోధుమ పిండి ధరల కంటే ప్రస్తుతం కాస్త పెంచడం గమనార్హం.