కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తుంది: మల్లికార్జున్ ఖర్గే
బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను వెంటాడే రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను వెంటాడే రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నాడు. మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్‌బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే ఇది కేంద్ర ప్రభుత్వం “ప్రతీకార రాజకీయం” అని అన్నారు. "ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులు తప్ప మరొకటి కాదు. ప్రతిపక్షంలో ఉన్న మరెవ్వరూ ఇలాంటి దుందుడుకు చర్యలకు భయపడరు" అని ఖర్గే అన్నారు. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ పై ఈడీ వేధింపులను ఖండిస్తున్నాను. ఆయనను రాత్రికి రాత్రే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? వీటన్నింటికి ప్రతిపక్షాలు భయపడబోవని మనీలాండరింగ్ కేసులో వి సెంథిల్ బాలాజీపై ED చర్యపై కాంగ్రెస్ ప్రెస్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.