స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారతీయ వ్యవస్థతో స్వలింగ వివాహాలను పోల్చలేమని తెలిపింది.

Update: 2023-03-12 11:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారతీయ వ్యవస్థతో స్వలింగ వివాహాలను పోల్చలేమని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన కేసుల్లో కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్నలింగ సంపర్కుల పెళ్లిళ్లు పూర్తిగా విరుద్ధమైనవని వ్యాఖ్యానించింది. వాటిని ఒకేలా పరిగణించడం కుదరదని అఫిడవిట్‌లో కేంద్రం వివరించింది.

స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలని కోరుతూ హైదరాబాద్​కు చెందిన అభయ్​ దాంగ్​, సుప్రియో చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు పార్థ్​ ఫిరోజ్, ఉదయ్‌రాజ్ అనే మరో స్వలింగ సంపర్కుల జంట కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరి పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు అన్నింటినీ ఏకం చేసి సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో తాజాగా కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.

Tags:    

Similar News