కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు పండగే..!
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వెళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వెళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంపు, పెన్షన్‌దారులకు 4 శాతం డియర్నెస్ రిలీఫ్‌ను ప్రకటించారు. తీసుకున్న నిర్ణయం ఆధారంగా జులై 1, 2023 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 18 రోజుల బోనస్‌ను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. రబీలో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచనున్నట్లు వెల్లడించారు.