CBSE : డ్రగ్స్‌పై సీబీఎస్ఈ చైతన్యభేరి.. దేశ రాజధానిలోని పాఠశాలలో అవగాహనా కార్యక్రమం
దిశ, నేషనల్ బ్యూరో : ఎంతోమంది యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారుతుండటాన్ని మనం చూస్తున్నాం.
దిశ, నేషనల్ బ్యూరో : ఎంతోమంది యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఈనేపథ్యంలో డ్రగ్స్ వినియోగం వల్ల చోటుచేసుకునే ఉపద్రవాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే దిశగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నడుం బిగించింది.
ఈక్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న మోడర్న్ స్కూల్‌లో ‘సే నో టు డ్రగ్స్ అండ్ యస్ టు లైఫ్’ పేరుతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.