కోల్‌కతా మర్డర్ కేసులో సంచలన విషయాలు బయట పెట్టిన సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి మర్డర్ కేసులో సీబీఐ సంచలన నిజాలు బయట పెట్టింది.

Update: 2024-08-22 12:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి మర్డర్ కేసులో సీబీఐ సంచలన నిజాలు బయట పెట్టింది. ఈ కేసును కోల్‌కతా హైకోర్ట్ సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్ట్ సుమోటోగా స్వీకరించి బుధవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు రిపోర్టును సీబీఐ గురువారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. కాగా ఈ నివేదికలో వైద్యురాలి మృతికి, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించిన కీలక విషయాలు బయటపెట్టింది. ఘటన జరిగిన ఐదు రోజులకు కేసు దర్యాప్తును తమకు అప్పగించారని తెలిపిన సీబీఐ, తాము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి క్రైమ్ సీన్ పూర్తిగా మార్చివేశారని నివేదికలో పేర్కొంది. బాధితురాలి మృతదేహం దహనం జరిగాక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని.. ఇందుకు సంబంధించి పలువురు పోలీస్ అధికారులను, వైద్యులను వాంగ్మూలాన్ని నమోదు చేశామని అన్నారు. తొలుత వైద్యురాలి మరణం ఆత్మహత్యగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని, మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు దారి తీయడంతో ఆమె సహోద్యోగులు, తల్లిదండ్రులు వీడియోగ్రఫీకి పట్టు బడితే, అప్పుడు తప్పనిసరై పోలీస్ అధికారులు పోస్టుమార్టం వీడియో తీశారని సీబీఐ సుప్రీంకు వివరించింది. 


Similar News