లంచం కేసులో నేషనల్ హైవేస్ అథారిటీ జనరల్ మేనేజర్ అరెస్ట్

ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఆయన ఈ లంచం తీసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు.

Update: 2024-03-03 10:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లంచం తీసుకున్న కేసులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) జనరల్ మేనేజర్ అరెస్ట్ అయ్యారు. రూ. 20 లక్షల లంచం తీసుకున్న కారణంగా ఎన్‌హెచ్ఏఐ జీఎం, ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కాలేను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఆయన ఈ లంచం తీసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టు తర్వాత జరిపిన సోదాల్లో లంచంగా తీసుకున్న రూ.20లక్షలతో పాటు మొత్తం రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి అరవింద్ కాలేతో పాటు లంచం ఇచ్చిన ప్రైవేటు కంపెనీ, మరో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News