Delhi liquor scam : మనీష్ సిసోడియాకు మరోసారి CBI నోటీసు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది.

Update: 2023-02-20 12:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని సోమవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతకు ముందు సీబీఐ ఫిబ్రవరి 19న సిసోడియాను విచారణకు పిలిచింది. అయితే బడ్జెట్ పనుల్లో ఉన్నందునా విచారణకు హాజరుకాలేనని, ఇందుకోసం మరికొంత సమయం కావాలని దర్యాప్తు అధికారులకు సిసోడియా ఆదివారం విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న తనకు బడ్జెట్‌ను రూపొంచించే ఈ సమయం అత్యంత కీలకమైనదని.. అందువల్ల ఈ నెల చివరి వారం తర్వాతే విచారణకు హాజరు అవుతానని సీబీని కోరారు. అయితే కొన్ని గంటల ఉత్కంఠ అనంతరం సీబీఐ మనీష్ సిసోడియా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి నోటీసులు ఇస్తూ ఫిబ్రవరి 26న విచారణకు ఆహ్వానించింది. అయితే తాను ఫిబ్రవరి చివరి వారం తర్వాతే విచారణకు హాజరవుతానని సిసోడియా చెప్పినప్పటికీ ఆలోపే సీబీఐ విచారణకు పిలవడం చర్చగా మారింది.

Tags:    

Similar News