Delhi excise policy case: కేజ్రీవాల్ పై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై సీబీఐ చర్యలు ముమ్మరం చేసింది.

Update: 2024-07-29 07:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై సీబీఐ చర్యలు ముమ్మరం చేసింది. ఈకేసులో ఈడీ ఇప్పటికే ఆయనపై ఛార్జి షీటు దాఖలు చేసింది. కాగా.. ఇప్పుడు సీబీఐ కూడా కేజ్రీవాల్ పై ఛార్జిషీటు దాఖలు చేసింది. లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌పై సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నేరపూరిత కుట్రలో ఆయన కూడా ఒకరని సీబీఐ పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనున్న తరుణంలో సీబీఐ కేజ్రీవాల్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. కాగా, గత నెల జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన సీబీఐకి సంబంధించిన కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.


Similar News