CBI : సీబీఐకి కర్ణాటక రెడ్ సిగ్నల్.. కేసుల విచారణకు అనుమతుల ఉపసంహరణ

దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో లోకాయుక్త విచారణను సీఎం సిద్ధరామయ్య ఎదుర్కోనున్న తరుణంలో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-26 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో లోకాయుక్త విచారణను సీఎం సిద్ధరామయ్య ఎదుర్కోనున్న తరుణంలో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సీబీఐకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈవిషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ గురువారం మీడియాకు వెల్లడించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముడా స్కాంతో ఈ నిర్ణయానికి సంబంధం లేదన్నారు.

‘‘సీబీఐ పక్షపాత వైఖరితో పనిచేస్తోంది. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా అది పనిచేస్తోంది. మేం సీబీఐకి రెఫర్ చేసిన అన్ని కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు. ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మేం రెఫర్ చేసిన కేసుల్ని సీబీఐ తిరస్కరించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి’’ అని హెచ్‌కే పాటిల్ తెలిపారు. దీంతోపాటు మరో కీలక నిర్ణయాన్ని కర్ణాటక క్యాబినెట్ తీసుకుంది. తమ అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన సమాచారాన్ని అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.


Similar News