ఒడిశా రైలు ప్రమాదానికి కారణం గుర్తించం: రైల్వే మంత్రి వైష్ణవ్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా చనిపోగా 1000కి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా చనిపోగా 1000కి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్ దేశాన్ని కలవరపరిచిన ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వ హై లెవల్ కమిషన్ వేసింది. అలాగే ట్రాక్ మరమ్మత్తు పనులను శరవేగంగా చేపడుతున్నారు. మంగళవారం ఉదయం వరకు పనులు పూర్తి చేసి యదావిధిగా రైళ్లు నడిచే విధంగా చూస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే..ట్రిపుల్ రైలు ఢీ కొనడానికి గల మూలకారణాన్ని గుర్తించామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ దీనిపై విచారణ జరిపారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకు సంబంధించిన సంఘటన జరిగిందని, దీనికి కవాచ్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.