ఈవీఎంలపై ఫేక్ న్యూస్.. ఆన్‌లైన్ ఛానల్‌పై కేసు
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), పోల్ అధికారులపై తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు ఓ ఆన్‌లైన్ ఛానల్‌పై కేరళలోని తిరువనంతపురం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), పోల్ అధికారులపై తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు ఓ ఆన్‌లైన్ ఛానల్‌పై కేరళలోని తిరువనంతపురం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సిటీ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో నమోదైన కేసు ప్రకారం.. తిరువనంతపురం జిల్లాలో ఉంచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయంటూ సదరు ఆన్‌లైన్ ఛానల్ ఫేక్ న్యూస్‌ను ప్రసారం చేసింది. అనంతరం దీనిపై ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఆన్‌లైన్ ఛానల్‌పై కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత.. ఈవీఎంలపై తాము ప్రచురించిన వార్తలను ఆన్‌లైన్ ఛానల్ ఉపసంహరించుకుంది.