ఇందిరా గాంధీ హత్యపై ఖలిస్థానీ పోస్టర్లు కలకలం.. స్పందించిన కెనడా

కెనడా ఉదాసీన వైఖరితో అక్కడ ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా వాంకోవర్ లో ఆపరేషన్ బ్లూస్టార్ 40వ వార్షికోత్సవం నిర్వహించారు.

Update: 2024-06-09 12:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ఉదాసీన వైఖరితో అక్కడ ఖలిస్థానీ మద్దతుదారుల రెచ్చిపోతున్నారు. కెనడా వాంకోవర్ లో ఆపరేషన్ బ్లూస్టార్ 40వ వార్షికోత్సవం నిర్వహించారు. భారత కాన్సులేట్ కార్యాలయం ఎదుట మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తున్నట్లు చిత్రీకరించారు. దీనిపైన కెనడా మంత్రులు స్పందించారు. కెనడియన్ పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్ మాట్లాడుతూ.. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. వాంకోవర్‌లో ఇందిరా గాంధీ హత్యను వర్ణించేలా చిత్రాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఇది పన్నూ చర్యే- కెనడా ఎంపీ చంద్ర ఆర్య

ఈ చర్యను హిందూ-కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వెలిశాయన్నారు. ఈ చర్యతో మరోసారి హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది కొన్నేళ్ల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన బెదిరింపులకు కొనసాగింపు అని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులను భారత్ తిరిగి వెళ్లాలని చెప్తున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూ చర్య అని ఆరోపించారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూపై కెనడాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్‌ చేశారు.


Similar News