పరీక్షల్లో క్యాలికులేటర్‌కు అనుమతి
కాలిక్యులేటర్ల వాడకం అనుమతిపై పరిశీలించడంపై పాఠ్యాంశాల కమిటీ మద్దతు ఇస్తుంది.ఇది పరీక్షా సమయంలో ఒత్తిడిని తగ్గించి, విద్యార్థుల పని తీరు మెరుగుపరుస్తుందని, జాతీయ విద్యా విధానం ఉన్నత స్థాయి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

- పరిశీలిస్తున్న సీబీఎస్ఈ
- సుదీర్ఘ గణనల భారాన్ని తగ్గించే లక్ష్యం
- అకౌంట్స్ ఎగ్జామ్స్‌లో అనుమతికి అవకాశం
దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఎగ్జామ్స్‌లో క్యాలికులేటర్ల వాడకానికి అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. అకౌంటెన్సీ ఎగ్జామ్స్‌లో సుదీర్ఘ గణనల భారాన్ని తగ్గించేందుకు గాను నాన్-ప్రోగ్రామబుల్ క్యాలికులేటర్లను అనుమతించే ప్రతిపాదనను పరిశీస్తోంది. విద్యార్థులు విశ్లేషణలు, కేస్ స్టడీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలు కల్పించడమే దీని ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. ఆమోదయోగ్యమైన కాలిక్యులేటర్ల నమూనాలను నిర్వచించడానికి, వాటి మార్గదర్శకాలను నిర్ధారించడానికి ఒక ప్యానల్ ఏర్పాటు చేస్తామని సీబీఎస్ఈ చెప్పింది. ఇప్పటికే సీబీఎస్ఈ 10వ, 12వ తరగతుల పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు క్యాలికులేటర్లను అనుమతిస్తుంది. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) 2021లో 12వ తరగతి విద్యార్థులకు క్యాలికులేటర్లు ప్రవేశపెట్టింది. బోర్డుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక కమిటీ 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షల్లో ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ క్యాలికులేటర్‌ను అనుమతించాలని ప్రతిపాదించింది. ఇది కేవలం కూడిక, తీసివేత, గుణాకారం, భాగాహారం, శాతం గణనల వంటి సాధారణమైన విషయాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, కాలిక్యులేటర్ల వాడకం అనుమతిపై పరిశీలించడంపై పాఠ్యాంశాల కమిటీ మద్దతు ఇస్తుంది.ఇది పరీక్షా సమయంలో ఒత్తిడిని తగ్గించి, విద్యార్థుల పని తీరు మెరుగుపరుస్తుందని, జాతీయ విద్యా విధానం ఉన్నత స్థాయి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ఎంపిక చేసిన సబ్జెక్టుల్లో మూల్యాంకనం కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేయడంపై కూడా సీబీఎస్ఈ ఆలోచిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతుల్లోని కొన్ని సబ్జెక్టుల్లో సైన్, మ్యాథ్స్ సప్లిమెంటరీ పరీక్ష, మ్యాథ్స్ రీవాల్యుయేషన్‌లో ఓఎస్ఎం ప్రతిపాదనను పైలెట్ ప్రాతిపదికన అమలు చేయనున్నారు.