Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పీఎం విద్యాలక్ష్మితో లక్షలాది మందికి లబ్ధి

పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (Food Corporation of India) రూ.10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Update: 2024-11-06 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం (Cabinet Meeting) పూర్తయిన తర్వాత.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. పీఎం విద్యాలక్ష్మి పథకానికి (PM Vidyalakshmi Scheme) కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 22 లక్షలమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దేశంలో 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.7.50 లక్షల వరకూ రుణం లభించనుంది. ఈ రుణంలో 75 శాతం రుణం వరకూ కేంద్రప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వనుంది. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే రూ.10 లక్షల వరకూ ఉన్న రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభించనుంది. యువత నాణ్యమైన విద్య అభ్యసించేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకం తోడ్పడుతుంది.

అలాగే.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (Food Corporation of India) రూ.10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎఫ్ సీఐ ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. 2004-14 సంవత్సరాలతో పోల్చితే.. 2014-2024 సంవత్సరాల మధ్య రైతులకు 4 రెట్లు అధికంగా ఆహార సబ్సిడీ అందిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 

Tags:    

Similar News