డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేబినెట్ ఆమోదం..

Update: 2023-07-05 14:18 GMT

న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ డేటా మొత్తం దాని చట్టపరమైన డొమైన్ కిందకు వస్తుంది. ఒక వ్యక్తి సమ్మతిస్తేనే వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తారు.

అయితే.. జాతీయ భద్రత, శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు డేటాను తీసుకునే అవకాశం ఉంది. చట్టంలోని నిబంధనలను పర్యవేక్షించేందుకు డేటా ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. డేటాను సేకరించే వారు దాన్ని భద్రపరచాలి. ఉపయోగించిన తర్వాత ఆ డేటాను తొలగించాలి.


Similar News