By polls: యూపీ, పంజాబ్, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు.. కారణమిదే?

ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీ మారింది.

Update: 2024-11-04 10:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్(Utharapradesh), పంజాబ్(Panjab), కేరళ(kerala) రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల(Assembly by polls) తేదీ మారింది. ఈ మూడు రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ (Polling) జరగనుండగా.. పోలింగ్ తేదీని 20వ తేదీకి మార్చినట్టు ఎన్నికల సంఘం(EC) సోమవారం వెల్లడించింది. యూపీలోని 9, పంజాబ్‌లోని 4, కేరళలోని 1 అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ జరగనుంది. నవంబర్ 13 నుంచి15 మధ్య కార్తీక మాసం సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు పోలింగ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని పోలింగ్ తేదీని మార్చినట్టు పేర్కొంది. కాగా, మహారాష్ట్ర-జార్ఖండ్‌తో పాటు 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 15న ఈసీ ప్రకటించింది.

Tags:    

Similar News