UP: ఆగ్రా-అలీఘర్ జాతీయ రహదారిపై బస్సు-వ్యాన్ ఢీ.. 12 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-వ్యాన్ ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించగా, 16 మందికి గాయాలు అయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-వ్యాన్ ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించగా, 16 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటన హత్రాస్‌లోని ఆగ్రా-అలీఘర్ జాతీయ రహదారిపై జరిగింది. జాతీయ రహదారి 93పై వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న వ్యాన్ ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో బస్సు వ్యాన్‌ను ఢీకొంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిని పోస్ట్‌మార్టం కోసం తరలించగా, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు హత్రాస్ నుంచి ఆగ్రాకు వెళ్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ, బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.