ట్రంప్‌కు బుల్లెట్ తగిలి కమలా మృతి చెందింది: రామ్ గోపాల్ వర్మ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 295 ఎలక్ట్రోరల్ ఓట్లతో గెలిచారు. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 295 ఎలక్ట్రోరల్ ఓట్లతో గెలిచారు. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్వీట్ లో "BULLET hit TRUMP and killed KAMALA" అని రాసుకొచ్చారు. అంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కి బుల్లెట్ తగిలితే డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) అభ్యర్థి కమల హారిస్(Kamala Harris) మృతి చెందింది అని రాసుకొచ్చారు. కాగా ఇది ట్వీట్ లో ఆర్జీవీ(RGV).. ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుండగా.. ఓ దుండగుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ (bullet) ట్రంప్ చెవికి తాకుతూ పక్కకు దూసుకుపోయింది. దీంతో ట్రంప్(Trump) పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో ట్రంప్ పై హత్యాయత్నం జరగడం వల్ల ఆయన గెలిచాడని,, కమలా హారిస్ ఓడిపోయిందని ఉద్దేశంతో ఆర్జీవీ(RGV) ట్వీట్ చేశారు.
Read More..
Samantha: రెచ్చిపోయిన సమంత.. ఆ హీరోతో కలిసి అలా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్