Budget 2023 Live Updates: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ కారణంగా కొన్ని వస్తవుల ధరలు పెరగనున్నాయి. మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లు, డీఎస్ఎల్ఆర్ కెమెరాల కోసం లెన్స్‌లు, టీవీ ఫ్యానెల్‌ల భాగాలు, లిథియం అయాన్ బ్యాటరీలు, డీ నాచర్డ్ ఇథైల్ ఆల్కహాల్, యాసిడ్- గ్రేడ్ ఫ్లోర్స్పార్ పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. అలాగే దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు తగ్గనున్నాయి. అలాగే గోల్డ్ బార్స్ నుంచి చేసే ఆభరణాలపై కస్టమ్స్ సంకం పెంచింది. సిగరేట్లపై కస్టమ్ డ్యూటీ 16 శాతానికి పెంచింది. దీని వల్ల వీటి రేట్లు పెరగనున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీ, బంగారం మరియు ప్లాటినంతో చేసిన వస్తువులు, వెండి వస్తువులు, రాగి స్క్రాప్,మిశ్రమ రబ్బర్ ధరలు పెరగనున్నాయి.
ఎంత ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో తెలుసా?
ఆదాయ పన్ను విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో ఈ మార్పులను చేశారు. ఇకనుంచి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో 'కొత్త ఆదాయ పన్ను విధానం' డీఫాల్ట్ ఆప్షన్‌ను రానుంది. ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్వవధిని 20-45 రోజుల నుంచి 15 రోజుల లోపునకు తగ్గిస్తున్నట్లు మంత్రి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ప్రకటించారు. ఎంత ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో కింద పట్టికలో క్లియర్‌గా వివరించడం జరిగింది.
పెరగనున్న సిగరేట్లు, బంగారం ధరలు.. తగ్గేవి ఏంటో తెలుసా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రకటించారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం చూస్తే.. కొన్ని విషయాల్లో సామాన్యులపై ప్రభావం పడే విధంగా ఉండగా.. కొన్ని విషయాలు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
వేతన జీవులకు భారీ ఊరట
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచింది. రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తూ ఇన్ కం టాక్స్ స్లాబ్‌లలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను చెల్లించేలా మార్పులు తీసుకువచ్చామన్నారు.
భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. అంతేగాక, టీవీలు, మొబైల్, కిచెన్ చిమ్నీ ధరలు సైతం భారీగా తగ్గనున్నాయి. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త
కేంద్ర బడ్జెట్ 2023-24 ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకునే వారికి కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి ఈసారి బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచారు. గత బడ్జెట్‌లో పీఎ ఆవాస్ యోజనకు రూ.48 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79 వేల కోట్లు కేటాయించింది. కాగా, వడ్డీ రేట్లు పెరుగుతోన్న వేళ ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే అంశం కావడం విశేషం.
వైద్య విద్యార్థులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ 2023-242ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఆయా రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. మెడికల్ కాలేజీలతో పాటు దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్!
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు కేంద్రం రూ.లక్ష కోట్లు కేటాయించగా ఈ సారి ఆ మొత్తాన్ని రూ.13.7 లక్షల కోట్లకు పెంచింది.
బడ్జెట్‌లో తొలిసారి విశ్మకర్మలకు ప్యాకేజీ!
బడ్జెట్‌లో తొలిసారిగా కొత్త ప్యాకేజీని కేంద్రం ప్రవేశపట్టింది. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ నిధి పేరిట ఆ ప్యాకేజీని తీసుకురానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ అనుసంధానం చేయడం ద్వారా వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం కోసం ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు సీతారామన్ వెల్లడించారు.
ఎన్నికల వేళ బడ్జెట్ లో కర్ణాటకకు వరాలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి సారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకపై వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి రూ.5,300 కోట్ల కేంద్ర నిధులు కేటాయించింది. కర్ణాటక రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో సాగునీటి సరఫరా కోసం ఈ నిధులను వెచ్చిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే కర్ణాటకకు ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం తెలుగు రాష్ట్రాలను విస్మరించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేథ్యంలో ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చి తెలుగు రాష్ట్రాలకు విస్మరించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. మరో వైపు వైద్య రంగంలో తెలంగాణ కు మొండి చెయ్యి చూపింది కేంద్రం. దేశంలో భారీగా మెడికల్ కాలేజీలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో గతంలో మెడికల్ కాలేజ్ లు ఇచ్చిన దగ్గరనే మళ్ళీ 157 నర్సింగ్ కాలేజ్ లను కేంద్రం ప్రకటించింది.
రక్షణ శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట
దేశ రక్షణకు 2023-24 బడ్జెట్ లో కేంద్రం పెద్దపీట వేసింది. దేశ సరిహద్దుల్లో పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి ఎదరవుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మిగతా శాఖల కంటే రక్షణ రంగానికి ఈ సారి భారీగా నిధులు కేటాయించింది. రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు రూ. 2.70 లక్షల కోట్లు, రైల్వేలకు రూ. 2.41 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాలు శాఖకు రూ.2.06 లక్షల కోట్లు కేటాయించింది. హోం మంత్రిత్వ శాఖకు రూ.1.96 లక్షల కోట్లు, రసాయన మరియు ఎరువుల శాఖకు రూ. 1.78 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.60 లక్షల కోట్లు, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు రూ.1.25 లక్షల కోట్లు, ప్రసార శాఖకు రూ.1.23 లక్షల కోట్లు కేటాయించింది.
కేంద్ర బడ్జెట్‌లోని 7 ప్రాధాన్యత అంశాలివే!
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రధానంగా 7 ప్రాధాన్యత అంశాలను బడ్జెట్‌లో చేర్చింది. అందులో సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌళిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి , యువ శక్తి, విత్తవిధానంలను కేంద్రం చేర్చింది. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మధ్యతరగతికి 'దేఖో అప్నాదేశ్' పథకం
మధ్యతరగతికి పర్యాటక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి 'దేఖో అప్నా దేశ్' అనే పేరును కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటకం కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యాన్ని అన్వేషించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు. ఈ పథకాన్ని ప్రధానంగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన చేశామన్నారు.
బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు ఇలా!
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మొత్తం రూ. 45.03లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. రక్షణ శాఖకు రూ.5.94లక్షల కోట్లు, రైల్వేశాఖకు రూ.2.41లక్షల కోట్లు, రోడ్లు, హైవేలకు రూ.2.70లక్షల కోట్లు, పౌరసరఫరాల శాఖ రూ.2.06 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 1.25 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1.6లక్షల కోట్లు కేటాయించారు.
కొత్తగా 50 ఎయిర్ పోర్టులు
2023-24 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్ పోర్టులు, హెలీప్యాడ్లు, ఏరోడ్రోమ్స్ నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పోర్టులను సైతం పునురుద్ధరిస్తామన్నారు. ఇందుకు గాను నిధుల కేటాయింపు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్
గత తొమ్మిదేళ్ల తమ పాలనలో 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ పద్దులు ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 11.7 కోట్ల గృహాలకు టాయిలెట్లను నిర్మించామన్నారు. ఉజ్వల యోజన పథకం ద్వారా 9.6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 102 కోట్ల మంది భారతీయులకు 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించామని స్పష్టం చేశారు. పీఎం జన్ ధన్ యోజన పథకంలో భాగంగా 47.8 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిపించామన్నారు. పీఎం సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా పథకంలో భాగంగా 44.6 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11.4 కోట్ల మంది రైతులకు రూ.2.2లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు.
పార్లమెంట్‌లో టంగ్ స్లిప్ అయిన నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో వెంటనే సవరించుకున్న మంత్రి సారీ చెప్పి సవరించుకున్నారు. వెహికల్ రీప్లేస్ మెంట్ గురించి మాట్లాడుతూ.. ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో ఒక్క సారిగా సభలో నవ్వులు పూశాయి. ఓల్డ్ వెహికల్స్ ను మార్చడం మన ఆర్థిక వ్యవస్థను పచ్చగా మార్చడంలో భాగమన్నారు. వెహికల్ స్క్రాపింగ్ పాలసీలో రాష్ట్రాలకు మద్దతు ఇస్తామన్నారు.
ఇవి కూడా చదవండి:
Budget 2023 Live Updates: బడ్జెట్‌లో తొలిసారి విశ్మకర్మలకు ప్యాకేజీ!