Budget 2023 Live Updates: వేతన జీవులకు భారీ ఊరట
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచింది.
దిశ,డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచింది. రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆదాయం రూ.7 లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ. 7 నుంచి 9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం 12-15 లక్షల వరకు ఉంటే 20 శాతం పన్ను, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధించనున్నారు.