దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక మాజీ సీఎం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కన్నడ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న చీటింగ్ కేసులో యడియూరప్పను సాయం కోరేందుకు తల్లికూతురు యడియూరప్ప దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తన 17 ఏళ్ల కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది
లోక్ సభ ఎన్నికల ముందు యడియూరప్పపై ఆరోపణలు రావడం సంచలంగా మారింది. ఇకపోతే 2008-2011 మధ్య కాలంలో కర్ణాటక సీఎంగా పనిచేశారు యడియూరప్ప. 2018లో కొద్దిరోజులపాటు, ఆ తర్వాత 2019-2021 మధ్య మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జూలై 2021లో బీజేపీ అధిష్ఠానం యడియూరప్పను తప్పించి ఆయన స్థాంలో బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి.. అధికారం చేపట్టింది.