2018 నుంచి వయసు తగ్గింపు ఫొటోలను విడుదల చేసిన బ్రయాన్‌ జాన్సన్‌

ప్రముఖ వ్యాపారవేత్త బ్రయాన్‌ జాన్సన్‌ తన వయస్సును రివర్స్ చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-10 09:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త బ్రయాన్‌ జాన్సన్‌ తన వయస్సును రివర్స్ చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌’ అని పేరు కూడా పెట్టారు. ప్రత్యేకమైన ఆహారం, 100 కంటే ఎక్కువ రోజువారీ సప్లిమెంట్‌లతో కూడిన కఠినమైన నియమావళిని ఆయన ఆచరిస్తున్నారు, దీనికి అతను దాదాపు సంవత్సరానికి రూ.16 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. 46 ఏళ్లు కలిగిన బ్రయాన్‌ తన వయస్సును 5.1 సంవత్సరాలను తగ్గించుకున్నట్లు ప్రకటించగా, తాజాగా తన వయసు తగ్గింపులో భాగంగా తన ముఖ ఆకృతి ఎలా మారిందో ప్రజలకు తెలియజేయడానికి 2018, 2023, 2024 సంవత్సరాల్లో తను ఎలా ఉండేవారో ఆయా ఫోటోలను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఎక్స్‌లో బ్రయాన్‌ జాన్సన్‌, "నా ఫేస్ ఐడి కూడా గందరగోళంగా ఉంది. నేను పరివర్తన చెందుతున్నాను..." అని రాశారు. అయితే ఈ ఫొటోల పట్ల యూజర్లు పలు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఆయన రూపాన్ని చూసి నవ్వుతుండగా, మరికొందరు యాంటీ ఏజింగ్ పట్ల అతని అంకితభావాన్ని ప్రశంసించారు. మరొక వినియోగదారు జుట్టు రంగులో చాలా మార్పులు వచ్చాయి. అది జరగాలంటే మీ శరీరం తప్పనిసరిగా వాటికి అవసరయైన పోషకాలు పొందాల్సి ఉంటుంది. దీనికి మీరు చాలా కష్టపడ్డారని తెలుస్తుందని ఎక్స్‌లో కామెంట్ చేశారు. వృద్ధాప్యాన్ని తగ్గించడానికి జాన్సన్ ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌లో భారీగా పెట్టుబడి పెట్టాడు, ఇందులో ప్రత్యేక ఆహారం, వైద్య పర్యవేక్షణ, చికిత్సలు, వ్యాయామం ఉన్నాయి.


Similar News