BREAKING: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ.. నేడు నామినేషన్ దాఖలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నేడు జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నేడు జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు ఆమె ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌తో కలిసి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే, ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో తిరిగి రాజ్యసభకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ విరమణ చేయడంతో రాజస్థాన్‌లో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీంతో సోనియా అదే స్థానం నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు.