బ్రేకింగ్ న్యూస్: ఆస్పత్రిలో చేరిన Nirmala Sitharaman ..?

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేఫథ్యంలో నిర్మలా సీతారామన్‌ను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Update: 2022-12-26 07:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో :కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేఫథ్యంలో నిర్మలా సీతారామన్‌ను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే, సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 63 ఏళ్లు ఉన్న కేంద్ర మంత్రి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్యంపై తొందరలో ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

కాగా, నిర్మలా సీతారామన్ ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని 'సదైవ్ అటల్'లో సీతారామన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంతలోనే నేడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. మరోవైపు, నిర్మలా సీతారామన్ సాధారణ వైద్య పరీక్షల కోసమే ఎయిమ్స్‌కు వెళ్లారని తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ ప్రతి ఏటా రెండుసార్లు మెడికల్ చెక్ అప్ చేయించుకుంటారని, అందులో భాగంగానే సోమవారం ఎయిమ్స్ కు వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News