బ్రేకింగ్ న్యూస్.. నాలుగు రాష్ట్రాలకు నూతన అద్యక్షులను ప్రకటించిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలు బీహార్,ఢిల్లీ,రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

Update: 2023-03-23 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలు బీహార్,ఢిల్లీ,రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఇందులో బీహార్ - సామ్రాట్ చౌదరి, ఢిల్లీ - వీరేంద్ర సచ్ దేవా, రాజస్థాన్ - సిపి జోషి, ఒడిశా - మన్ మోహన్ సామ లను నియమిస్తూ జేపీ నడ్డా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ సంవత్సరం చివర్లోరాజస్థాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. వచ్చే సంవత్సరం లో ఓడిశాలో ఎన్నికలు రానున్నాయి.ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాలకు నూతన అద్యక్షులను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News