BREAKING : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పదోసారి ఈడీ నోటీసులు.. ఆయన రియాక్షన్ ఇదే

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. భూ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఇవాళ పదోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది.

Update: 2024-01-27 15:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. భూ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఇవాళ పదోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 29, 31 తేదీల్లో అందుబాటులో విచారణకు రావాలని తెలిపింది. భూ కుంభకోణం కేసులో భాగంగా జనవరి 20న హేమంత్‌ సోరెన్‌ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్ట్ చేశారు. ఈడీ నోటీసులు ఇవ్వడంపై హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. తనకు ప్రమేయం లేని కేసుల్లో ఇరికించేందకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా ఎవరికీ భయపడేది లేదని పేర్కొన్నారు. ఈ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్ అయ్యారు. అందులో ఓ ఐఏఎస్ అధికారి ఉండటం గమనార్హం.

Tags:    

Similar News