Breaking News : CAA‌ ముమ్మాటికీ వాళ్లకు వ్యతిరేకం కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ CAAపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-14 05:28 GMT
Breaking News : CAA‌ ముమ్మాటికీ వాళ్లకు వ్యతిరేకం కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ CAAపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు ముస్లింలకు వ్యతిరేక చట్టంగా అభివర్ణించాడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బిల్లు విషయంలో మైనారిటీలు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని అభయమిచ్చారు. ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేసే నిబంధన సీఏఏలో లేదని పేర్కొన్నారు. విపక్షాలు కావాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. CAAపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, ఆ విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని అమిత్ షా తేల్చి చెప్పారు.

Tags:    

Similar News