Thane: బిస్కెట్ ఫ్యాక్టరీ యంత్రంలో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం జరిగింది. బిస్కెట్ ఫ్యాక్టరీలోని మెషిన్ బెల్ట్‌లో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందారు.

Update: 2024-09-04 07:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం జరిగింది. బిస్కెట్ ఫ్యాక్టరీలోని మెషిన్ బెల్ట్‌లో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందారు. థానేలోని అంబర్ నాథ్ లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మూడేళ్ల బాలుడు తన తల్లితో పాటు టిఫిన్ సరఫరా చేసే బిస్కెట్ ఫ్యాక్టరీకి వెళ్లినట్లు వెల్లడించారు. ఆ బాలుడు ఫ్యాక్టరీలోని బెల్ట్ నుంచి బిస్కెట్ తీసుకునేందుకు యత్నించారు. అప్పుడు మెషిన్ బెల్ట్ లో ఇరుక్కుపోయాడు. ఫ్యాక్టరీ సిబ్బంది బాలుడ్ని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపయినట్లు వైద్యులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు అంబర్ నాథ్ పోలీసులు తెలిపారు.


Similar News