రాజస్థాన్ లో రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు

రాజస్థాన్ రాష్ట్రంలోని బుధవారం ఒక్క రోజునే పలు రైల్వేస్టేషన్లకు ఉగ్రవాద సంస్థ పేరుతో బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Update: 2024-10-02 07:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాష్ట్రంలోని బుధవారం ఒక్క రోజునే పలు రైల్వేస్టేషన్లకు ఉగ్రవాద సంస్థ పేరుతో బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబు బెదిరింపుల పట్ల అప్రమత్తమైన అధికారులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ జంక్షన్ లో స్టేషన్ సూపరింటెండెంట్ కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో బెదిరింపు లేఖ పంపాడు. అందులో శ్రీరంగా నగర్, బికనీర్, జోధ్ పూర్, కోట, బుందీ, ఉదయపూర్, జైపుర్ తో సహా పలు స్టేషన్లలో బాంబు దాడులు జరగనున్నాయని పేర్కొన్నారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బీఎస్ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేశాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అలాగే జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దేశంలో తరచూ బాంబు బెదిరింపులు, రైల్వే పట్టాలపై ప్రమాదాలను కల్గించేలా చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం తనిఖీలు పెంచింది.   


Similar News