Bomb Threat: తమిళనాడులోని మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

Update: 2024-09-30 08:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధురైలోని (Madurai School) కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్‌, వేలఅమ్మాల్‌ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో, అప్రమత్తమైన స్కూల్స్ మేనేజ్ మెంట్ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

రంగంలోకి దిగిన పోలీసులు

పాఠశాలల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌ స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ సాయంతో ఆయా స్కూళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి విద్యార్థులను వాళ్ల నివాసాలకు పంపించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్‌ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు.


Similar News