బీజేపీ లీడర్ ఇంటి పై బాంబుల దాడి
బీహార్లోని గయాలో బీజేపీ నాయకుడి సంతోష్ గుప్తా ఇంటి పై బాంబులు విసిరి దుండగులు దాడికి ప్రయత్నించారు.
దిశ, వెబ్డెస్క్: బీహార్లోని గయాలో బీజేపీ నాయకుడి సంతోష్ గుప్తా ఇంటి పై బాంబులు విసిరి దుండగులు దాడికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు సంతోష్ గుప్తా ఇంటిపై నాలుగు బాంబులు విసిరారు. దీంతో ఆ బాంబులు ఇంటి గోడలకు, కిటికీలకు తగిలి పేలడం క్లియర్గా కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అలాగే బీజేపీ నాయకుడి ఇంటి పై బాంబులు విసిరిన దుండగులు బైక్ పై వచ్చి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. అలాగే త్వరలో నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.