దేశాన్ని కాషాయ మయం చేయడానికే బీజేపీ కుట్ర: దూరదర్శన్ లోగో మార్చడంపై స్టాలిన్ వ్యాఖ్యలు
దూరదర్శన్ లోగోను ఎరుపు కలర్ నుంచి కాషాయం రంగులోకి మార్చడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బీజేపీ ప్రతి దానినీ కాషాయ మయం చేయడానికే కుట్ర చేస్తో్ందని ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: దూరదర్శన్ లోగోను ఎరుపు కలర్ నుంచి కాషాయం రంగులోకి మార్చడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బీజేపీ ప్రతి దానినీ కాషాయ మయం చేయడానికే కుట్ర చేస్తో్ందని ఆరోపించారు. ఇటువంటి ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశాన్ని కాషాయీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. తమిళ సన్యాసి కవి తిరువల్లువర్‌ను కాషాయీకరణం చేశారని అన్నారు. కేంద్ర తీసుకుంటున్న చర్యలు సరైనవి కావని తెలిపారు. కాగా, జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ లోగోలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు కూడా బీజేపీపై మండిపడ్డాయి. లోగో రంగు మార్చడం అనైతికమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. అయితే దూరదర్శన్ లోగో మొదట కాషాయం రంగులోనే ఉండేదని..దానిని తిరిగి తీసుకొచ్చామని బీజేపీ చెబుతోంది.