కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలవడం కూడా కష్టమే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం దక్కించుకుంటుందనే భ్రమలో ఉందని, పగటి కలలు కంటోందని తెలిపారు.

Update: 2024-04-19 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పోలింగ్ మొదలైన తరుణంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాక్యలు చేశారు. బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ 40 స్థానాలు గెలవడం కూడా కష్టమేనని ఎద్దేవా చేశారు. కేంద్ర సమాచార, ప్రసారాలు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఓ ప్రకటనలో.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం దక్కించుకుంటుందనే భ్రమలో ఉందని, పగటి కలలు కంటోందని తెలిపారు. కాంగ్రెస్ పేపర్ బ్యాలెట్‌లను వాడటం గురించి మాట్లాడుతుంది ఎందుకంటే గతంలో పోలింగ్ బూత్‌లను లూటీ చేశారు కాబట్టి. బ్యాలెట్ బాక్సులైతే దొంగ ఓట్లు వేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ఈవీఎంల వల్ల పారదర్శకత ఉంటుందని, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎంతో గొప్పగా నిర్వహిస్తోంది. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న అతిపెద్ద బలమని ఠాకూర్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లో కూడా తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలలు కంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్‌ను ఉద్దేశించి ఠాకూర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే ఛత్తీస్‌ఘఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఠాకూర్ అన్నారు. ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ మళ్లీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటోందని వెల్లడించారు. 

Tags:    

Similar News