BJP Sensational Comments: ఫొటోలకు పోజులిచ్చేందుకే.. నిరసన శిబిరానికి మమత! బీజేపీ సంచలన వ్యాఖ్యలు

గత కొద్ది రోజులుగా కోల్ కతా(Kolkata) ఆర్ జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ లైంగిక దాడి(Junior Doctor Rape and Murder) కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యుల వద్దకు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) వెళ్ళడంపై బీజేపీ(BJP) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-09-14 16:51 GMT

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా కోల్ కతా(Kolkata) ఆర్ జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ లైంగిక దాడి(Junior Doctor Rape and Murder) కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యుల వద్దకు.. పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) వెళ్ళడంపై బీజేపీ(BJP) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఫొటోలకు పోజులిచ్చేందుకే వైద్యుల నిరసన శిబిరానికి మమత వెళ్లారని మండిపడింది.

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్(West Bengal) బీజేపీ కో-ఇంచార్జీగా ఉన్న అమిత్ మాలవీయ(Amit Malviya) 'ఎక్స్'(X) లో మాట్లాడుతూ.. "మమతా బెనర్జీ, సీఎం స్వస్థ్ భవన్ కు వెళ్తూ పక్కనే ఉన్న వైద్యుల నిరసన వద్దకు వెళ్లి వారితో కేవలం 5 నిమిషాలు మాట్లాడారని అన్నారు. అయితే అక్కడ నిరసన తెలుపుతున్న వైద్యులు మాత్రం మమతను పట్టించుకోకపోగా, ఆమె మాటలను వారు అస్సలు నమ్మటం లేదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ చిత్తశుద్ది లేని వ్యక్తి అని, అందుకే ఈ సమస్యను అస్సలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఆమెకు నిజంగా మృతురాలి పట్ల బాధ్యత ఉండి ఉంటే.. ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించి మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేసేవారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి వల్ల బెంగాల్ రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా దెబ్బతింటోంది" అంటూ అమిత్ మాలవీయ 'ఎక్స్'లో వెల్లడించారు.

కాగా, జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడిని నిరసిస్తూ.. పశ్చిమ బెంగాల్(West Bengal) ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం(Health Department Headquarters) ఎదుట వైద్యులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం నిరసన శిబిరానికి మమత వెళ్ళగా.. న్యాయం కావాలి అంటూ వైద్యులు గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు. తదనంతరం బెంగాల్ సీఎం అక్కడున్న వైద్యులతో మాట్లాడుతూ.. "ఎండా వానల్లో మీరు రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. నాకు చాలా బాధగా ఉందని, ఈ ఘటన జరిగిన నాటి నుంచి తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ప్రస్తుతం మీ డిమాండ్లను పరిశీలిస్తున్నామని, తప్పకుండా బాధ్యులకు కఠినంగా శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటాము" అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమత వెల్లడించారు.


Similar News