బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం లేదు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సత్యం, భారత ప్రజలు ఇండియా కూటమి వైపే ఉన్నారని తెలిపారు.

Update: 2024-03-17 09:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సత్యం, భారత ప్రజలు ఇండియా కూటమి వైపే ఉన్నారని తెలిపారు. ఆదివారం ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ కాదని రెండు భావోద్వేగాల మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోదని, దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ‘గౌరవం, ప్రేమ భారత్ డీఎన్ఏలోనే ఉంది. రెండు యాత్రల్లో దీనిని గమనించాను. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ భారత్ ప్రేమతోనే పోరాడింది’ అని వ్యాఖ్యానించారు.

‘దేశంలో కొంతమంది కోటీశ్వరుల రుణాలు మాఫీ చేయబడ్డాయి. కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. కొందరి వద్దే దేశ సంపద అంతా ఉంది. యువత, రైతులు, కూలీలకు అన్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. మోడీ, ఆర్ఎస్ఎస్‌లు వారికే విజ్ఞానం ఉంది అన్నట్టు ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియా కూటమిలో నాయకత్వం, సరైన ప్రణాళిక వారి వద్ద లేదన్నారు. 

Tags:    

Similar News