Mehbooba Mufti : ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీరీల్లో ఆగ్రహం :మెహబూబా ముఫ్తీ

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉండబట్టే కశ్మీర్‌కు చెందిన ప్రాంతీయ పార్టీలు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.

Update: 2024-09-08 15:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉండబట్టే కశ్మీర్‌కు చెందిన ప్రాంతీయ పార్టీలు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘‘ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిందనే ఆగ్రహం కశ్మీరీ ప్రజల్లో ఉంది. వాళ్లంతా తమ స్పందనను ఈ ఎన్నికల్లో బ్యాలట్ ద్వారా చూపించబోతున్నారు’’ అని ఆమె చెప్పారు. తాము తీసుకున్న ఓ నిర్ణయం (ఆర్టికల్ 370 రద్దు) కారణంగా కశ్మీరీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందనే విషయం బీజేపీ నేతలకు కూడా తెలుసన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో బీజేపీ నేతలకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

ఆదివారం కశ్మీర్‌లోని కోకెర్‌నాగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మెహబూబా ముఫ్తీ ఈ కామెంట్స్ చేశారు. ‘‘2014లో బీజేపీతో పొత్తు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రయత్నాలు చేశారనే విషయాన్ని బీజేపీ నేత దేవేందర్ సింగ్ రాణా ఇటీవలే బయటపెట్టారు. అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నైజమని గత చరిత్ర నిరూపిస్తోంది’’ అని ఆమె విమర్శించారు.


Similar News